1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

29, మే 2012, మంగళవారం

పెళ్లంటే... రెండు మనసుల కలయికా? నూరేళ్ల సాన్నిహిత్యమా? లేక రెండు కుంటుంబాల ఆదిపత్య పోరా?

వివాహ బంధాన్ని మూడింతల అద్భుతంగా చెప్పవచ్చు

వారిద్దరు ఏక శరీరమగుదురు కాబట్టి అది ఒక భౌతిక బంధము.

రెండు కుటుంబాలు ఒకరితో ఒకరు అంటుకట్టబడుతారు కాబట్టి అది ఒక సాంఘిక అద్భుతం.

దైవానికి, సమాజానికి గల సంబంధాన్ని వివాహం చూపిస్తుంది కాబట్టి అది ఒక ఆత్మీయ బంధం అని కూడా చెప్పవచ్చు.

ప్రేమంటే ఇద్దరి మనసుల కలయిక కావచ్చు, మరి పెళ్లంటే? అదో పెద్ద వ్యవస్థ. మనసుల కలయికను మించి ఇద్దరి జీవితాలను, వారి కుటుంబాలను కలిపే అతి పురాతనవ్యవస్థ.


భారత దేశ కీర్తి ప్రతిష్టలకు, ప్రపంచంలోనే అతి గొప్ప సాంప్రదాయ వ్యవస్థగా అవతరించడానికి కారణం మూడే..

  • ఒకటి కుటుంబ వ్యవస్థ
  • రెండు వైవాహిక వ్యవస్థ
  • మూడవది ఆధ్యాత్మిక జ్ఞానం
ప్రాచీన భారత వివాహ వ్యవస్థ గురించి, దాని లాభాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది, చెప్పుకోవాల్సింది ఏమి లేదు.....సర్దుకుపోయి, ఎక్కడైనా ఆనందంగా బ్రతకడం నేర్పే అందమైన ప్రక్రియ....కానీ ఈ వ్యవస్థ నానాటికి దిగాజారిపోతోంది, కారణాలు అనేకం.... ఇప్పుడు నేను చర్చించబోయేది  వివాహ వ్యవస్థ ఇలా దిగజారిపోవడానికి కారణాలు...

  • కుల మతాలు & డబ్బు, పరువు-ప్రతిష్టలు:- ఇద్దరు ఒకరి కొకరు సరిపోతారో లేదో తెలుసుకోకుండా, వారి భావాలూ, ఆలోచనలతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు చేసే కుల పిచ్చి తలకెక్కిన మరియు డబ్బు మదంతో మత్తెక్కి ఊరేగే పిచ్చి కుక్కలు లాంటి తల్లి దండ్రులు ఉండడం.......
  • అహంకారం, ఆదిపత్యం: - నాగరికత, ప్రపంచీకరణ పేరుతో అర్ధం చేసుకోవడం మానేసి, సర్దుకుపోవడం మానేసి...స్వాభిమానం అన్న మాటకు వక్ర భాష్యం చెప్తూ అహంకార మదంతో, ఆదిపత్యం కోసం పోరాడే భార్య భర్తలు ఉన్నంత కాలం...
  • చిన్నాభిన్నం అయిపోయిన ఉమ్మడి కుటుంబాలు: అనుభవాలు నేర్పిన పాటలనుంచి, అవసరమైన సలహాలు ఇచ్చే పెద్దలు లేక.....తెగిపోయిన గాలిపటంలా ఎగిరే చిన్న కుటుంబాలు ఉన్నంత కాలం.....
  • ఈ రోజుల్లో విడాకుల సంస్కృతి ఎక్కువవుతున్నది. ప్రతి చిన్న కారణానికి సర్దుకుపోవడానికి ప్రయత్నించడం కంటే, విడిపోవడం సులభంగా ఉండడంతో.... ఇమడలేక విడాకులు తీసుకోవడానికి సిద్దపడుతున్నారు...
వీటితో పాటుగా....

తల్లి/ఇంట్లో ఇతరుల మాటకు కట్టుబడి, వారి అధిపత్యం కోసం.... తన వాళ్ళను అందరిని వదులుకొని వచ్చిన జీవిత బాగస్వామిని పట్టించుకోక, ఆమెను ప్రేమాభిమానాలకు దూరంగా ఇంట్లో పని మనిషిలా చూస్తూ, తన సంసార జీవితంలో ఆనందాన్నిచేజేతులా నాశనం చేసుకుంటున్న కొడుకులు....

తల్లి/ఇంట్లో ఇతరుల చెప్పుడు మాటలు వింటూ..భర్తను & వారి కుటుంబ సభ్యులను చెప్పు చేతల్లో  పెట్టుకోవాలన్న అర్ధం లేని ఆలోచనలతో, తమ జీవితాలను తామే తెలియకుండా నాశనం చేసుకుంటున్న బార్యలు ......

అహంకారపు అగ్నిలో, ఆదిపత్య పోరుకోసం, నాగరికత మత్తులో, డబ్బున్న మదంతో, డబ్బు, పరువు, ప్రతిష్టల కోసం తమ నిండు జీవితాలను తామే బలి తీసుకుంటున్న భార్య భర్తలు ఉన్నారు......

నాలుగు గోడల మద్య ఉండవలసిన భార్య భర్తల తగాదాలను.. సర్ది చెప్పే పెద్దవారితో కాకుండా.......అహంకారం కోసం, ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని, వారి సలహాలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు మనతో  పాటే జీవితం అనుకున్న వారిని దుఖ సాగరంలో ముంచుతున్నారు....

ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు....అలాగే 100% ఒకే అభిప్రాయాలూ ఉండే మనుసులు ఎవరు ఉండరు.... కాబట్టి ఇద్దరి మద్య భేదాలు సహజం..కానీ వాటిని సర్దుకొని పోవడంలోను.. ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలోను.....ఒకరి అభిప్రాయాలను, భావాలను, భావనలను మరొకరు గౌరవిన్చుకోవడంలోనే ఆనందకరమైన జీవితం ఉంది. 

అందరిని నా వారు అని చూసే సార్వ జనీనమైన ప్రేమలోనూ... అంతా మనదే అన్న కలుపుగోలు తనంలోను
సంతోసకరమైన జీవితం ఉంది....

దంపతుల మద్య లేని పోని దూరాలకు, అగదాలకు కారణం అవుతున్నది మన తల్లి/ తండ్రి/ లేదా ఇంకెంత దగ్గరి వారైనా సరే, మనమే తక్షణమే నిర్దాక్షిణ్యంగా ఖండించగలిగితే.... ఏ బంధం ఐనా కలకాలం కలకలం లేకుండా ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా సాగిపోతుంది....

వీరు అనుకున్నవి సాధించడానికి, వారి విలువైన, ఆనందకరమైన సంసార జీవితాన్నే తాకట్టు పెట్టడమే  కాకుండా....  వారితో జీవితాన్ని పంచికోవటానికి వచ్చిన వారి ఆనందాలను హరిన్చివేస్తూ...తమకి తామే దహనం ఐపోతున్నారని తెలుసుకోలేకపోతున్నారు...







రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు...కాబట్టి... ఒకరు ముర్ఖంగానో, కోపంగానో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు....అలాగని అవతలి వాళ్ళు ఎల్లలు దాటి ప్రవర్తిన్చెంత చనువు, సాంతం కూడా పనికిరాదు... 

భర్తల చేతిలో బాధలు పడుతున్న భార్యలు ఉన్నారు అలాగే పెళ్ళాల చేతిలో కీలుబొమ్మగా మారిన భర్తలు ఉన్నారు... ఎక్కడి కదిపితే మొదటికే మోసం వస్తుందో అని.... మార్పు రాకపోతుందా, తెలుసుకోకపోతారా  అని నిరీక్షించే వారు ఉన్నారు.... అలోచించి వెంటనే నిర్ణయం తీసుకునే వారు ఉన్నారు.... కానీ మనం వేసే ప్రతి అడుగు అవతరివారిలోని చెడు స్వభావాన్ని అణగదొక్కే మంచి అడుగై ఉండాలి.... ఇలాంటప్పుడు చేతులు కలే అవకాసం లేకపోలేదు....

తన తల్లి, తండ్రులు బావుండాలని కోరుకుంటూ...అత్తా మామలను హింసించే జాతి వారు కొందరైతే.......భార్యను/భర్తను ఊపిరి తీసుకోనియ్యని వారు మరి కొందరు...... ఈ మద్య నా దృష్టికి వచ్చిన చాలా మంది సంసార సాగరం లో ఈది ఈది అలసితి, సొలసితి అంటూ ఉన్నవారే ఎక్కువ.....

వేరు వేరు కుటుంబాలు, స్థితి గతుల మధ్య పెరిగిన ఒక పురుషుడు, ఒక స్త్రీ... దేవుని ఎదుట సంఘం సాక్షిగా ప్రమాణాలు చేసుకొని ఈ వివాహబంధం లో చేరి భార్య, భర్తలుగా మారుతారు. ఇది వారి కుటుంబ జీవితానికి ఒక తొలిమెట్టు. మరి ఈ బంధం ఎలా కొనసాగించాలి? ఎలా కాపాడుకోవాలి? ఎలా దీనిలో ఆనందించాలి ?
 

భార్యా భర్తల బంధం విజయవంతంగా వుండాలంటే ఇరువురు కూడా తమ స్వజనం, బంధువులకంటే... ఎదుటి వారి స్వజనమునకు ప్రాధాన్యత ఇవ్వాలి.

భార్యా భర్తలిద్దరూ రొజూ ఉదయం, సాయంత్రం కలిసి కాసేపు అహంకారాలు, అరమరికలు లేకుండా మాట్లాడుకుంటే ఉంటే ఒకరి నొకరు అర్ధం చేసికోడానికి అది సహాయపడుతుంది.

చిన్న చిన్న అపార్థాలు, వాటికి మనసు గాయపడటం, తిరిగి సర్దుకోవడం, ఎప్పటికైనా నిలిచేది ప్రేమేనన్న సత్యం....

ఐనా జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల్లో ఈ ఇగో అనేది ఎందుకు?
అని  ప్రతి దంపతులు ఆలోచిస్తే....మీ జీవితం ఒక నిత్య ఆనంద కరమైన పయనం అవుతుంది....



మీరు అలా కావాలనుకుంటున్నారా ? అయితే మీరే ఆలోచించండి.....
హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

great post srinivas garu... I love it.....

Suman CIQ చెప్పారు...

Too good srinu.. I liked it very much.

Vivek చెప్పారు...

nice article.....vivek

tripura sundari చెప్పారు...

After reading this article, only a few people will comprehend and adequate their lifestyle.